చీరాలకు చెందిన పల్లపు రేణుక (39) మంగళవారం విచారణ నిమిత్తం పెదకూరపాడు సర్కిల్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ అనారోగ్యం, మూర్ఛ కారణంగా మొదటి అంతస్తు పిట్టగోడ పైనుంచి కిందపడటంతో, మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఆమె మరణించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, వదంతులు నమ్మొద్దని సీఐ స్పష్టం చేశారు.