చీరాల: మగ్గం నేసిన ఎమ్మెల్యే కొండయ్య

2225చూసినవారు
చీరాల: మగ్గం నేసిన ఎమ్మెల్యే కొండయ్య
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మల్లన్నకు సమర్పించే చేనేత తలపాగా వస్త్రాన్ని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గురువారం చేనేత మగ్గంపై నేయడం జరిగింది. ఈ కార్యక్రమం బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, శ్రీశైల దేవస్థాన తలపాగా కార్యక్రమ వర్కింగ్ ప్రెసిడెంట్ భూసం శ్రీనివాసరావు, హస్తినాపురం బట్ట సాంబశివరావు సమన్వయంతో శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, గ్రామ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్