చీరాల: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.10 లక్షలు దోపిడీ

4226చూసినవారు
చీరాల: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.10 లక్షలు దోపిడీ
డిజిటల్ అరెస్ట్ అనేది లేదని పోలీసులు, మీడియా చెబుతున్నా సైబర్ నేరగాళ్ల మోసాలు ఆగడం లేదు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 78 ఏళ్ల వృద్ధుడిని లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి వీడియో కాల్ చేసి, తనఖా పెట్టిన బంగారం నకిలీదని, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని భయపెట్టాడు. దీంతో ఆందోళనకు గురైన వృద్ధుడు తన ఖాతా నుంచి రూ.10 లక్షలు పంపించాడు. ఆ తర్వాత ఫోన్లు పనిచేయకపోవడంతో మోసపోయానని గుర్తించాడు.

సంబంధిత పోస్ట్