బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో గోగినేని వెంకటసుబ్బారావుకు చెందిన 105 ఏళ్ల పెంకుటిల్లు తరతరాల జ్ఞాపకాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. 1920లో మట్టి అడుసు, ఇటుక, రాయితో గానుగ సున్నం వాడి నిర్మించిన ఈ ఇంటిలో మొదట్లో 25 మంది ఉమ్మడి కుటుంబం నివసించేది. ప్రస్తుతం 7వ తరం వారు నివసిస్తున్నారు. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం, ఇంటి పెంకులను ఐదేళ్లకు ఒకసారి మారుస్తుంటారు. ఈ ఇల్లు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుందని తెలిపారు.