చీరాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాఘవయ్య, సింగమ్మ దంపతులు మృతి చెందారు. పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామానికి చెందిన ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. గతంలో వీరి ఇద్దరు కుమారులు కూడా ఇదే రహదారిపై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మృతి చెందడంతో, ఆ కుటుంబంలో ఒకరు తప్ప మిగిలిన వారందరూ రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించినట్లు తెలిసింది. కారంచేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.