విద్యుత్ ఛార్జీల తగ్గింపు: నవంబర్ నుంచి అమలు

1378చూసినవారు
బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, నవంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని, ప్రతి యూనిట్ కు 13 పైసలు తగ్గించనున్నారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం ఐదు సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి ప్రభుత్వం 966 కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించిందని, అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలును నియంత్రించిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలపై భారం పడకుండా ఛార్జీలు పెంచబోమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై మంత్రి నారా లోకేష్ చర్చించారని రవికుమార్ తెలియజేశారు.