బాపట్ల, చీరాలలోని విఠల్ నగర్ లో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇళ్ల మధ్య ఉన్న పూరిల్లు నుంచి భారీగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందినప్పటికీ ఫైర్ ఇంజన్ సకాలంలో రాకపోవడంతో, అప్రమత్తమైన స్థానికులు, యువత కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో గడ్డివాములు, మరికొన్ని ఇళ్లకు నిప్పు అంటుకోకుండా పెద్ద ప్రమాదం తప్పింది.