బాపట్ల జిల్లా మొంథా తుఫాన్ నేపథ్యంలో కారంచేడు గ్రామం వద్ద వాగు ఉగ్రతను పరిశీలించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కూడా పాల్గొన్నారు. పచ్చురు వద్ద ఈ పరిశీలన జరిగింది.