చిన్నగంజాం మండలం మున్నంవారిపాలెం ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి, 38 ఏళ్ల సుదీర్ఘ సేవ తర్వాత జూన్ 30న ఉద్యోగ విరమణ చేసిన ఎం. మల్లారెడ్డికి పాఠశాల సిబ్బంది,
విద్యార్థులు, గ్రామస్తులు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధతను అభినందిస్తూ, మండల ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాలు, గ్రామస్తులు అభినందన సభ నిర్వహించారు. విద్యార్థుల ఉన్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.