కారంచేడు వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి

3చూసినవారు
కారంచేడు వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి
కారంచేడు-చీరాల మార్గంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో మైలా రామారావు (54) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. కారంచేడులో నివసిస్తున్న రామారావు చీరాల వెళుతుండగా, వాడరేవు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు పాత వాడరేవు పిడుగురాళ్ల హైవేపై కారంచేడు సమీపంలో ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, 108 సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని, మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందినవాడని, కొద్దిరోజులుగా కారంచేడులోని కుమార్తె ఇంటి వద్ద ఉంటున్నాడని బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్