తీరంలో కొత్త సందడికి సన్నద్ధం

6చూసినవారు
తీరంలో కొత్త సందడికి సన్నద్ధం
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వాడరేవు నుంచి పొట్టిసుబ్బయ్యపాలెం వరకు ఉన్న రిసార్ట్స్ యజమానులు సందర్శకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రామాపురంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అనేక మంది గదులను బుక్ చేసుకున్నారు. సందర్శకుల కోసం వివిధ రకాల ప్యాకేజీలు, వెల్కం డ్రింక్, క్యాంపు ఫైర్స్, డీజే సౌండ్స్, విద్యుత్ దీపాలతో తీరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కేకులు కోసి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్