బిజెపి పదవులకు ఆరుగురు మహిళా నేతల రాజీనామాలు

7125చూసినవారు
బిజెపి పదవులకు ఆరుగురు మహిళా నేతల రాజీనామాలు
బిజెపి బాపట్ల జిల్లా అధ్యక్షుడు, పార్టీ జిల్లా ఇన్చార్జిల వ్యవహార శైలిని నిరసిస్తూ ఆరుగురు మహిళా నేతలు ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ అధిష్టాన వర్గం తక్షణం ఈ వ్యవహారాన్ని సరిదిద్దాలన్నారు. అప్పటి వరకు బిజెపి కార్యకలాపాలకు దూరంగా ఉంటామని వారు చెప్పారు. తాము పదవులనే వదులుకుంటున్నాము తప్ప పార్టీని వీడిపోవడం లేదని వారు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అంకితభావంతో పనిచేసే తమలాంటి కార్యకర్తలను పార్టీ హై కమాండ్ కాపాడాలని, పార్టీ నేతల ఏకపక్ష ధోరణికి స్వస్తి చెప్పాలని పదవులకు రాజీనామా చేసిన బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ఓబిసి మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ క్షత్రియ సుహాసిని బాయి కోరారు.

సంబంధిత పోస్ట్