చేనేత మహిళల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. గౌతమ్‌ మాజుందర్‌

5చూసినవారు
చేనేత మహిళల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. గౌతమ్‌ మాజుందర్‌
ప్రభుత్వం జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌ ద్వారా బాపట్ల జిల్లా చీరాల–వేటపాలెం ప్రాంతాల్లోని చేనేత మహిళల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మిషన్‌ ప్రతినిధులు నీలెందు ముఖర్జీ, డాక్టర్‌ ఎన్‌.పి.ఆర్‌. నాథన్‌, గౌతమ్‌ మాజుందర్‌ దేశాయిపేట గ్రామంలో చేనేత వృత్తిపై ఆధారపడుతున్న మహిళలతో ప్రత్యేక సమావేశం సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా చేనేత కార్మికుల జీవనోపాధి, ఆదాయ వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్