చీరాలలో RTC బస్సు ఢీకొని మహిళ మృతి

4చూసినవారు
చీరాల RTC డిపో వద్ద శుక్రవారం RTC బస్సు ఢీకొనడంతో 62 ఏళ్ల బొనిగల ఆదిలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారంచేడు మండలం జరుబులవారిపాలెంకు చెందిన ఆదిలక్ష్మిపై ప్రమాదవశాత్తు బస్సు వెనుక చక్రం ఎక్కడంతో ఈ ఘోరం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.