
కురిచేడులో పేకాట ఆడుతున్న ఇద్దరు అరెస్ట్
ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 13,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి, చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తూ కేసు నమోదు చేశారు.

































