
గురజాడ అప్పారావు 110వ వర్ధంతి: సామాజిక దురాచారాలపై పోరాటం స్ఫూర్తిదాయకం
గుంటూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు గారి 110వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ అసిస్టెంట్ ఆర్. కుమార్, గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమార్ మాట్లాడుతూ, గురజాడ అప్పారావు తన రచనలతో సామాజిక దురాచారాలపై పోరాడి, తెలుగు సాహిత్యానికి వెలుగు జాడగా నిలిచారని, ఆయన అభ్యుదయ దారి నేటికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



































