అనంతపురం నుంచి గుంటూరుకు టమాటాల లోడుతో వెళ్తున్న మహీంద్రా బొలెరో వాహనం బుధవారం తెల్లవారుజామున ఫిరంగిపురం సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయిన డ్రైవర్ వాహనాన్ని అదుపుతప్పి పక్కకు తిప్పడంతో బొలెరో రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.