రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ‘సూర్య’ దినపత్రిక గుంటూరు జిల్లా ఇన్చార్జి సూర్య నాయక్‌ను
టీడీపీ యువ నాయకుడు మాదల చైతన్య శనివారం గుంటూరులోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో చెవుల కృష్ణాంజనేయులు, పంతగాని యోహానుబాబు, వల్లంశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.