శనివారం రాత్రి అద్దంకి పట్టణంలోని బ్రహ్మానందం కాలనీ సమీపంలో ముండ్లమూరు మండలం బట్లపల్లికి చెందిన రావులపల్లి మధు (23)పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. మాట్లాడాల్సి ఉందని చెప్పి పిలిచి, అనంతరం దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. తీవ్రంగా గాయపడిన మధును స్థానికులు అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు రెఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.