ఎకనామిక్స్ విద్యార్థుల అపూర్వ కలయిక

1చూసినవారు
ఎకనామిక్స్ విద్యార్థుల అపూర్వ కలయిక
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా, ఎకనామిక్స్ విభాగంలో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. 1976లో విభాగం ఏర్పడినప్పటి నుంచి తొలి మూడు బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సమావేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఈఎస్ అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు, వివిధ విశ్వవిద్యాలయాల్లో కీలక పదవుల్లో ఉన్నవారు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ అపూర్వ కలయిక చారిత్రిక ఘట్టంగా నిలిచింది.

సంబంధిత పోస్ట్