గుంటూరులోని గుండయ్య తోటలో గురువారం HELP సంస్థ ఆధ్వర్యంలో కిశోర బాలుర కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో 14 మంది బాలురు పాల్గొన్నారు. వారికి గృహహింస, బాలలపై హింస, కారణాలు మరియు ప్రభావాల గురించి వివరించారు. గృహహింస నిరోధక చట్టం-2005, పోక్సో చట్టం-2012, జువెనైల్ జస్టిస్ చట్టం-2015పై అవగాహన కల్పించారు. సిబ్బంది శర్మిల మాట్లాడుతూ, హింసకు వ్యతిరేకంగా పోరాడాలని, అత్యవసరమైతే 1098 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని బాలురకు సూచించారు.