తాడేపల్లి పరిధిలోని పెనుమాకలో బుధవారం భారీ వర్షాల ప్రభావంతో కొండచరియలు విరిగిపడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో షేక్ మీరాభి (50) అనే మహిళ శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. ప్రస్తుతం అధికారులు శిథిలాల కింద చిక్కుకున్న ఆమె మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.