
గుంటూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
ఆదివారం గుంటూరు నగర శివారులోని 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగవారానికి చెందిన చాట్ల నాని, అశోక్ అనే యువకులు బైక్పై గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా, చౌడవరం సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.







































