
అధికారుల తీరుపై ఎమ్మెల్యే గళ్లా మాధవి అసంతృప్తి
గుంటూరులో నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే గళ్లా మాధవి వినూత్న నిరసన తెలిపారు. దర్గా రోడ్డులోని గుంతలను స్వయంగా కంకర, మట్టితో పూడ్చే పనులు చేపట్టారు. అధికారుల దృష్టికి, కౌన్సిల్ తీర్మానానికి, కలెక్టర్, కమిషనర్ విజ్ఞప్తులకు స్పందన రాకపోవడంతోనే తాను ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. వేలాది వాహనాలు తిరిగే ప్రధాన రహదారిని పట్టించుకోకపోవడం బాధాకరమని, అధికారులు విఫలమైన చోట జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు.


































