
పల్నాడు: మినీ ట్రక్ బోల్తా.... ఇద్దరు మృతి
కారంపూడి - దాచేపల్లి రహదారిలో బుధవారం సాయంత్రం పచ్చి మిర్చి లోడుతో వస్తున్న మినీ వ్యాన్ బోల్తా పడి ఒప్పిచర్ల గ్రామానికి చెందిన మొగిలి సైదులు (43), షేక్ సమీర్ (19) మృతి చెందారు. పెదకొదమగుండ్ల నుండి కారంపూడి వస్తుండగా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ రివర్స్ చేయడంతో వెనుక వైపు ఉన్న గుంతలను గమనించక వ్యాన్ బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.




































