
నాగేశ్వరపురం తండాలో మంత్రి సూర్య ఘర్ పథకం ప్రారంభం!
మాచవరం మండలం నాగేశ్వరరావు పల్లెలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రధాని సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించారు. కోటి 20 లక్షల రూపాయలతో ఈ పథకం ఆదర్శంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోదీ తక్కువ ఖర్చుతో విద్యుత్ అందేలా ఈ పథకాన్ని రూపొందించారని, ఆదర్శ గ్రామంగా నాగేశ్వరపురం ఎంపికైందని పేర్కొన్నారు. సుమారు 80 ఇళ్లకు సోలార్ రంగులు అమర్చి విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.



































