పల్నాడు జిల్లా మాచర్లలో మంగళవారం బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బిళ్ళకంటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ, బీసీలు రాజకీయంగా ఎదిగితేనే వారి అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్, నియోజకవర్గ పెద్దలు జింకల నాగేశ్వరరావు, బృంగ రమణతో పాటు పలువురు బీసీలు పాల్గొన్నారు. ఈ సమావేశం నూతన కార్యవర్గ నియామకానికి సంబంధించి జరిగింది.