మాచర్ల పట్టణంలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

3288చూసినవారు
మాచర్ల పట్టణంలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మాచర్ల పట్టణంలో సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిజిటల్ కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. మాచర్ల పట్టణంలోని వివిధ వార్డుల్లో రహదారులు, వీధి దీపాలు, పార్కులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ పనులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం ద్వారా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని మాచర్ల పట్టణంలోని శ్రీనివాస మహల్ సెంటర్ ఆవరణలో డిజిటల్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్