పల్నాడు జిల్లా వెల్దుర్తిలోని హారిక ఉన్నత పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా ఏకదంత విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణేష్ నవరాత్రులు, వినాయక చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు స్వామివారిని పూజించి, మంగళవారం ఘనంగా నిమజ్జనం చేశారు. పిల్లల కేరింతల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది.