భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ప్రముఖులు, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహనీయుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలో
బీజేపీ నాయకులు అసెంబ్లీ బి ఎల్ ఎ -1 నాసరయ్య జి , ఎస్ఐఆర్ కన్వీనర్ గొబ్బూరి శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు ఘనంగా నివాళులర్పించారు.