జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యేకు వినతి

7చూసినవారు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యేకు వినతి
ఐ.జే.యు దేశవ్యాప్త పిలుపు మేరకు మాచర్ల నియోజకవర్గంలో శుక్రవారం జర్నలిస్టుల న్యాయమైన కోరికలు, సమస్యల పరిష్కారం కోసం మాచర్ల పట్టణంలో కోర్కెల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఐ.జే.యు సభ్యుడు గాడిపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మనందరెడ్డికి వినతిపత్రం అందించారు. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఐ.జే.యు సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్