ఐ. జే. యు దేశవ్యాప్త పిలుపు మేరకు మాచర్ల పట్టణంలో శుక్రవారం జర్నలిస్టుల కోర్కెల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఐ. జే. యు సభ్యులు గాడిపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జర్నలిస్టుల న్యాయమైన కోరికలు, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మనందరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.