మాచర్లలోని కె.సి.పి కమ్యూనిటీ హాల్లో మాజీ పార్లమెంటు సభ్యులు కోటా సైదయ్య స్మారక గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా, ఉన్నత పాఠశాల విద్యార్థులకు దేశభక్తి గీతాలపై నృత్య ప్రదర్శన ప్రిలిమినరీ పోటీలు శనివారం జరిగాయి. ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక అభిలాష, దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యమని రోటరీ క్లబ్ అధ్యక్షులు పఠాన్ నాగూర్ వలి తెలిపారు. ఎంపికైన నృత్యాలను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమంలో ప్రకటిస్తారు.