
మంగళగిరి: పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్
మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మంత్రి లోకేష్ మహా పడిపూజ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించి, స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీలతో పాటు పెద్దఎత్తున భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


































