కృష్ణా నదిలో దూకి వృద్ధుడు ఆత్మహత్యాయత్నం

2863చూసినవారు
కృష్ణా నదిలో దూకి వృద్ధుడు ఆత్మహత్యాయత్నం
కృష్ణానదిలో శుక్రవారం రాత్రి దూకి ఆత్మహత్యకు యత్నించిన 64 ఏళ్ల వినుకొండ నాగేశ్వరరావును తాడేపల్లి ట్రాఫిక్ ఎస్సై నారాయణ సకాలంలో స్పందించి కాపాడారు. మంగళగిరి టిడ్కో హౌసింగ్ బ్లాక్-బికి చెందిన వినుకొండ నాగేశ్వరరావు లారీ డ్రైవర్ గా పనిచేసి గతంలో జరిగిన ప్రమాదం కారణంగా ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, భార్య అనారోగ్యం వంటి కారణాలతో మనస్థాపానికి గురైన ఆయన ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు గమనించి ట్రాఫిక్ ఎస్సై నారాయణకు సమాచారం ఇవ్వగా ఆయన గజ ఈతగాళ్లను రప్పించి ఒడ్డుకు చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్