వర్షాల ధాటికి కూలిన మంగళగిరి ఆలయ ప్రహరీ గోడ

7చూసినవారు
వర్షాల ధాటికి కూలిన మంగళగిరి ఆలయ ప్రహరీ గోడ
మురసు తుఫాన్ ప్రభావంతో 500 ఏళ్ల చరిత్ర కలిగిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన ప్రాంగణంలోని ప్రహరీ గోడ కూలిపోయింది. భారీ వర్షాలతో గోడ కూలడంతో ఆందోళన నెలకొంది. పురాతన నిర్మాణాల పరిరక్షణ, భక్తుల భద్రతపై అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. గోడ కూలడానికి కారణాలను సాంకేతికంగా పరిశీలించాలని సూచిస్తున్నారు. కూలిన గోడ స్థానంలో పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రహరీ గోడను బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శేఖర్, స్థపతి పరమేశ్వరరావు, దేవస్థాన ఈవో కోగంటి సునీల్ కుమార్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్