బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు రహదారిపై సోమవారం లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతిని, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.