స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

6చూసినవారు
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ
పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల - మర్రిచెట్టుపాలెం మార్గంలో బుధవారం ప్రమాదం జరిగింది. మర్రిచెట్టుపాలెం నుంచి విప్పర్ల వైపు వెళ్తున్న నరసరావుపేట కు చెందిన సిబిఐటి* స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను తక్షణమే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్