పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 కార్యక్రమం జరిగింది. పరిశుభ్రత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేసిన 164 సంస్థలు, వ్యక్తులను కలెక్టర్ కృతికా శుక్లా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. స్వచ్ఛ NGO విభాగంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (DBRC)కు అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ఎమ్మెల్సి మర్రి రాజశేఖర్ కూడా పాల్గొన్నారు.