నరసరావుపేట ప్రకాష్ నగర్‌లోని ఓ ప్రైవేటు బాయ్స్ హాస్టల్‌లో గురువారం అర్ధరాత్రి కొందరు యువకులు గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని, ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నారు.