
పర్చూరు: అనారోగ్యంతో ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి
పర్చూరులోని రామాలయం వీధికి చెందిన సాంబశివరావు అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 20న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం అతను మృతి చెందాడు. ఈ ఘటనపై పర్చూరు ఎస్సై పులి గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





































