అంగన్వాడీలో గాయపడిన బాలుడు విషపురుగు కాటుతో మృతి

1415చూసినవారు
అంగన్వాడీలో గాయపడిన బాలుడు విషపురుగు కాటుతో మృతి
కారంచేడు మండలం నందిగుంట పాలెం గ్రామంలో అంగన్వాడీకి వెళుతున్న బాలుడు బుధవారం మృతి చెందాడు. అంగన్వాడీలో కాలికి గాయమైన బాలుడిని ఇంటికి పంపగా, వాంతులు కావడంతో వైద్యులను సంప్రదించారు. విషపురుగు కుట్టినట్లు గుర్తించి మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన పర్చూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది.