అమృతలూరు మండల పరిధిలోని పెదపూడి గ్రామంలో శనివారం తెనాలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపైకి వచ్చిన గేదెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. యజమాని తెలిపిన వివరాల ప్రకారం, మృతి చెందిన గేదె విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు.