ప్రత్యేక అధికారుల పాలనతో అవినీతి: సర్పంచుల ఆరోపణ

1169చూసినవారు
ప్రత్యేక అధికారుల పాలనతో అవినీతి: సర్పంచుల ఆరోపణ
స్థానిక పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, గతంలో 20 నెలల ప్రత్యేక అధికారుల పాలనలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇంకొల్లు మండలంలోని పలు పంచాయతీ సర్పంచులు ఆరోపించారు. ఈ అవినీతిపై విచారణ, ఆడిటింగ్, రికవరీ వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదని వారు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికలు జరిగే వరకు తమనే ఇన్చార్జులుగా కొనసాగించాలని కోరుతూ ఇంకొల్లు ఎంపీడీవో శ్రీనివాస రావుకు సర్పంచులు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్