కారంచేడు ఎస్ఐ ఖాదర్ భాష బుధవారం కారంచేడు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు అలవర్చుకుంటే సమాజంలో మంచి భవిష్యత్తు సాధించవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.