పిడుగురాళ్ల - వాడరేవు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన మిరపకాయల వ్యాపారి షేక్ మస్తాన్వలీ (55) అక్కడికక్కడే మృతి చెందారు. చిలకలూరిపేట నుంచి చీరాల వైపు వెళ్తున్న కారు ఉప్పుటూరు వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న మోపెడ్‌ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాదంలో మృతుడి తల తెగిపడి, శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. పర్చూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.