పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆసుపత్రిలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల పలు ఎలక్ట్రికల్ పరికరాలు దెబ్బతిన్నాయి. మంగళవారం పర్చూరు న్యాయస్థానం సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ మార్పు పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమయంలో వార్డుల్లో ఇన్వర్టర్లు పనిచేయక రోగులు అసౌకర్యానికి గురయ్యారు. వేడిని తట్టుకోలేక పోయామని రోగులు వాపోయారు.