శుక్రవారం వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై పర్చూరు సమీపంలోని సర్వీస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో గాయపడిన బైక్ రైడర్‌ను పర్చూరు ఎస్సై పులి గోపి ఘటనాస్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌లో పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.