నూతలపాడుకు సాగర్ జలాలు.. తాగునీటి సమస్యకు ఊరట

304చూసినవారు
నూతలపాడుకు సాగర్ జలాలు.. తాగునీటి సమస్యకు ఊరట
పర్చూరు మండలం నూతలపాడు గ్రామ తాగునీటి అవసరాల కోసం బుధవారం సాగర్ జలాలను విడుదల చేశారు. గ్రామ చెరువులు నిండేలా కాలువల ద్వారా నీటిని తరలించేందుకు పూడికతీత పనులు చేపట్టి, చెత్తాచెదారాన్ని తొలగించారు. పీఎసీఎస్ చైర్మన్ విన్నకోట సతీశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పనుల అనంతరం, సాగర్ నీటి రాకతో తాగునీటి సమస్యకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్