విషజ్వరాల నివారణకు మునగోడులో పారిశుద్ధ్య పనులు

8చూసినవారు
విషజ్వరాల నివారణకు మునగోడులో పారిశుద్ధ్య పనులు
పల్నాడు జిల్లా అమరావతి మండలం మునగోడు గ్రామంలో బుధవారం వర్షాకాలంలో విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణలో గడ్డి మందులు పిచికారీ చేసి, డ్రైనేజీ కాల్వల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్